పాము విషానికి వ్యతిరేకంగా ల్యాబ్‌లో కొత్త యాంటీవెనమ్ తయారీ!

రిపోర్టర్: రాము స్థలం: కర్ణాటక

పాముకాటు ప్రాణభయం తగ్గించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు డెన్మార్క్ పరిశోధకులు సరికొత్త యాంటీవెనమ్‌ను అభివృద్ధి చేశారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా బయోటెక్నాలజీని ఉపయోగించి ప్రయోగశాలలోనే లామా నానోబాడీల ద్వారా ఈ విరుగుడును తయారు చేశారు. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఇది విషప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.