'ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత': శ్రీకాకుళంలో స్పందన కార్యక్రమం

రిపోర్టర్: రమేష్ స్థలం: Srikakulam

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ (స్పందన) కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చిన 58 అర్జీలను స్వీకరించిన ఆయన, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.