పీఎం కిసాన్ 24వ విడతపై కేంద్రం కీలక ప్రకటన
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అర్హులైన రైతులు నవంబర్ లేదా అక్టోబర్ చివరి వారంపై వస్తున్న వూహాగానాలను నమ్మవద్దని సూచించింది. లబ్దిదారులు ఎలాంటి అంతరాయం లేకుండా నిధులు పొందేందుకు ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, అధికారిక పోర్టల్ ద్వారా తమ స్టేటస్ చెక్ చేసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.