'మా నాన్నను మాకు తెచ్చివ్వండి': రోడ్డు ప్రమాదంలో పాల వ్యాపారి మృతితో కుటుంబం రోదన
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గుర్ల మండలం కొండగండ్రేడుకు చెందిన పాల వ్యాపారి బోడసింగి లక్ష్మణరావు బ్యాంకు పనిపై గరివిడికి ద్విచక్రవాహనంపై వెళ్లగా, పాత గరివిడి వద్ద భారత్ పెట్రోల్ బంకు ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆయనను ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో లక్ష్మణరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పాల బిల్లు తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిన యజమాని విగతజీవిగా మారడంతో భార్య ఈశ్వరమ్మ, పిల్లలు నీలిమ, యుగంధర్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.