'తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తాం': సింగపూర్ ప్రతినిధుల బృందం
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో సెమీకండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధుల బృందం ప్రకటించింది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్స్ సిటీ అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం వారితో చర్చించి, డిసెంబరులో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించారు.