చెల్లెలి హత్యకు ప్రతీకారంగా భర్తను నడిరోడ్డుపై పొడిచి చంపిన సోదరుడు

రిపోర్టర్: రాజేష్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్‌ రాజరాజేంద్ర చౌరస్తాలో యూట్యూబర్‌ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన ఆమె భర్త చిత్తరి హరిబాబును ఆమె సోదరుడు సంతోష్‌ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. గతేడాది ప్రేమ వివాహం చేసుకున్న వైష్ణవిని మార్చిలో హరిబాబు హత్య చేయగా, బెయిలుపై బయటకు వచ్చిన అతడిని గురువారం నగరంలో తల్లి వద్ద ఉన్న సమయంలో సంతోష్‌ హతమార్చాడు. ఈ ఘటనపై సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసిన సంతోష్‌ అనంతరం కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయాడు.