పైడితల్లి తొలేళ్లు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: ఈవో శిరీష వెల్లడి
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
విజయనగరం పైడితల్లి ఉత్సవాలను అత్యంత పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈవో శిరీష వెల్లడించారు. రాష్ట్ర పండగ నేపథ్యంలో ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు విడుదల చేసిందని ఆమె తెలిపారు. భక్తుల కోసం యాభై వేల లడ్డూలు, ముప్పై ఐదు వేల పులిహోరా ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు వివరించారు. మంగళవారం సాయంత్రం కల్లా ఊరేగింపు ముగిసేలా తగిన చర్యలు చేపట్టామని, వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.