విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంటి జంక్షన్ వద్ద లారీ ఆటోను ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బాడంగి మండలం గజరాయనివలసకు చెందిన మృతుల వివరాలను పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.