నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఓఎన్జీసీలో మూడు వేలకు పైగా అప్రెంటిస్ పోస్టులు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా వివిధ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోందని అధికారులు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు వేల నలభై ఏడు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నవంబర్ ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.