గణేష్ నిమజ్జన మార్గాల్లో గుంతలను వెంటనే పూడ్చాలని టీడీపీ డిమాండ్

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గణేష్ నిమజ్జన మార్గాల్లోని గుంతలను వెంటనే పూడ్చి మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. కన్నాల ఫ్లైఓవర్ నుంచి పోచమ్మగడ్డ చెరువు వరకు రహదారులు అధ్వానంగా ఉన్నాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి రోడ్లను బాగు చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీ. మణిరామ్సింగ్, రామటెంకి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.