ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి నివాసంలో పూజలు నిర్వహించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నారా లోకేశ్ కూడా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.