పులివెందులలో ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్ పెట్టాలంటూ వైఎస్ జగన్ డిమాండ్

రిపోర్టర్: శివ స్థలం: పులివెందుల

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో ఓటు హక్ కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఘోరంగా ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. బూత్ లను ఆక్రమించి దొంగ ఓట్లు వేస్తున్నారని, ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.