హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నాలుగో క్లౌడ్ రీజియన్ ప్రారంభం
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
భారత్‌లో క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను మరింత విస్తరించే దిశగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో తన నాలుగో క్లౌడ్ రీజియన్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఇండియా సౌత్ సెంట్రల్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కొత్త కేంద్రం ద్వారా దేశంలో డేటా సెంటర్ల అవసరాలు, క్లౌడ్ సేవల సామర్థ్యం మరింత పెరగనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ వెల్లడించారు.