దేశభక్తిపై రేవంత్ రెడ్డి, ఒవైసీల వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Telangana
దేశభక్తి గురించి రేవంత్ రెడ్డి, ఒవైసీ మాట్లాడటం హాస్యాస్పదమని బీజేపీ విమర్శించింది. వందేమాతరాన్ని వ్యతిరేకించిన వారు, సర్జికల్ స్ట్రైక్ సాక్ష్యాలు అడిగిన వారు దేశభక్తి గురించి సుద్దులు చెప్పడం విడ్డూరమని పేర్కొంది. మోదీ, అమిత్ షాలతో వీరిని పోల్చుకోవడం మిలీనియం జోక్ అని ఎద్దేవా చేస్తూ, వీరిద్దరి పొత్తుపై బీజేపీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.