పశుపోషకులకు 85 శాతం రాయితీతో నూతన పశుబీమా సౌకర్యం

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని పశుపోషకులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నూతన పశుబీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని పశుసంవర్ధక శాఖ ఏడీ అరుణ తెలిపారు. ప్రీమియంలో 85 శాతం రాయితీని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. గేదెలు, ఆవులకు మూడేళ్ల బీమా సదుపాయం ఉండగా, మేలు జాతికి 30 వేలు, నాటు జాతికి 15 వేల రూపాయల బీమా లభిస్తుంది. గొర్రెలు, మేకలకు సైతం ఇది వర్తిస్తుందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.