పాలకొండ రెండో వార్డు సర్వతోముఖాభివృద్ధే ధ్యేయమంటూ వైసీపీ అభ్యర్థి ప్రచారం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ రెండో వార్డ్ వైసీపీ అభ్యర్థి కిల్లారి మోహన్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సేవకే అంకితమవుతానని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, వార్డు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. వార్డు అభివృద్దే తన ధ్యేయమని, ప్రజాసేవయే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.