షాకింగ్ ఘటన: పరీక్షా హాల్ నుంచి వచ్చి భవనం పైనుంచి దూకిన విద్యార్థిని
రిపోర్టర్: మహేష్
స్థలం: జైపూర్
రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న యశస్వి రోహిల్లా అనే విద్యార్థిని పరీక్షా హాల్ నుంచి బయటకు వచ్చి భవనం ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం ఉదయం మిడ్ సెమిస్టర్ పరీక్ష జరగాల్సి ఉండగా, ఆమెకు వచ్చిన ఒక ఫోన్ కాల్ తర్వాత ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.