నంద్యాలలో కాలనీల పర్యటన: అభివృద్ధి సమస్యలపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమీక్ష
రిపోర్టర్: సతీష్
స్థలం: నంద్యాల
నంద్యాలలోని ఎంవీ నగర్, బృందావన్ కాలనీ అలాగే వీవర్సు కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆమె భరోసానిచ్చారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.