ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని బొబ్బిలిలో సిపిఐ నాయకుల డిమాండ్
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో బలిజిపేట రోడ్డు జండా మహల్ జంక్షన్ వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, మునకాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల బతుకులు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్‌మార్కెట్, దళారీ దోపిడీని అరికట్టి ధరల భారాన్ని తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.