హైవే విస్తరణ: హైదరాబాద్-విజయవాడ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఢిల్లీలో జాతీయ రహదారుల సంస్థ అధికారులతో జరిపిన ప్రత్యేక సమావేశం అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది. సుమారు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో మల్కాపూర్ నుంచి నందిగామ వరకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అత్యంత ఆధునిక హంగులతో పూర్తి చేయనున్నారు.