వంట గ్యాస్ సబ్సిడీ కోసం ఈ కేవైసీ తప్పనిసరి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

రాయితీపై వంట గ్యాస్ పొందే కస్టమర్లు ఆధార్ బయోమెట్రిక్ లేదా ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు నిలిచిపోవడంతో పాటు గ్యాస్ బుకింగ్స్ బ్లాక్ కానున్నాయి. ఇండేన్, హెచ్ పీ, భారత్ గ్యాస్ వినియోగదారులు సంబంధిత యాప్ ల ద్వారా వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.