కీలక ప్రాంతాలపై రష్యా భీకర డ్రోన్ దాడి
రిపోర్టర్: అశోక్
స్థలం: World
కీలక ఉక్రెయిన్ ప్రాంతాలపై రష్యా భీకర డ్రోన్ దాడికి పాల్పడింది. గోస్టొమెల్ వద్ద సైనిక సామాగ్రి గిడ్డంగిని ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చర్చల సమయంలో సైనిక చర్యలను నిలిపివేయబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ స్పష్టం చేశారు. యుద్ధభూమిలో ఒత్తిడి కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.