ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ లో విజేతగా నిలిచిన ధీరజ్ బొమ్మదేవర
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
మెక్సికో వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ లో విజయవాడకు చెందిన ధీరజ్ బొమ్మదేవర అద్భుత విజయం సాధించారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో జపాన్ క్రీడాకారుడు జున్యా నకానిషిని ఓడించి, పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆర్చర్ గా చరిత్ర సృష్టించారు. షూట్-ఆఫ్ లో అద్భుతమైన ప్రదర్శనతో 10 పాయింట్లు సాధించి విజయం మునుపు నిలిచారు. ఈ ఘనతపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా అభినందించారు.