కేరళ చికిత్స ముగించుకుని తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

కేరళంలో ఆయుర్వేద చికిత్స ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా పరామర్శించారు. తీవ్రమైన భుజం నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కేరళలోని ఆయుర్వేద కేంద్రంలో చికిత్స పొందిన పవన్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. చికిత్స సమయంలోనూ బాధ్యతలను విస్మరించకుండా సమీక్షలు నిర్వహించడం పట్ల పవన్ అంకితభావాన్ని చంద్రబాబు ప్రశంసించారు.