అమరావతిలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: Amaravati
అమరావతి తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ప్రపంచశ్రేణి ప్రమాదాలతో ఈ నేత్ర వైద్య సంస్థ ఏర్పాటు కావడం గర్వకారణమన్నారు. పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రం ద్వారా ఏటా లక్షలాది మందికి వైద్య సేవలతో పాటు పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.