స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశం
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియను రాబోయే ఆరు వారాల్లోపు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్ల కోటా యాభై శాతం దాటకూడదని స్పష్టం చేసింది. వార్డుల పునర్విభజన పిటిషన్లను తోసిపుచ్చింది.