మడిబాకలో ఘనంగా జరుగుతున్న ఆరవ రోజు వినాయక ఉత్సవాలు

రిపోర్టర్: katikapalli perumal స్థలం: నగరి

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజుల కండ్రిగ గ్రామంలో ఆరవ రోజు వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నిర్వాహకులు ప్రత్యేక పుష్పాలంకరణతో గణనాథుడిని అలంకరించారు. భక్తి గీతాలు, వినాయక నామస్మరణలతో ఆ ప్రాంతమంతా పూర్తిగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.