అమృత్సర్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొన్న ఇన్నోవా కారు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమృత్‌సర్

అమృత్సర్ లోని తారావాలా వంతెన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువతి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఎస్ హెచ్ ఓ అమన్దీప్ కౌర్ వెల్లడించారు. చర్చికి వెలికి వస్తున్న ఆటోను వెనుక నుంచి ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.