విశాఖ తాగునీటి సంక్షేమంపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఫైర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో తాగునీటి ఎద్దడిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖలో తాగునీరు లేని పరిస్థితి మొట్టమొదటిసారి చూస్తున్నామని ఆయన ఆరోపించారు. పోలవరంలో టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతూ, మరోవైపు విశాఖలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు ఇస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.