రూపాయల ఇరవై ఐదు కోట్ల నిధులతో పలాస అభివృద్ధికి అడుగులు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల రూపాయలతో కీలక అడుగు వేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పధకం ద్వారా చేపడుతున్న ఈ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.