టెక్నాలజీతో మాతృప్రేమ: తల్లి కోసం ఇన్హోమ్ వీడియో కాల్ సెటప్
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
తల్లికి దూరంగా ఉద్యోగం చేస్తున్న హర్ష్ సావర్గాంకర్ సరికొత్త టెక్నాలజీ ఆలోచనతో అందరినీ ఆకట్టుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాత ల్యాప్టాప్, పెద్ద స్క్రీన్ సాయంతో ఇంటర్నెట్ ద్వారా ఇల్లు, కార్యాలయం మధ్య నిరంతరం ఇరవై నాలుగు గంటలు వీడియో కాల్ కనెక్ట్ అయ్యేలా ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎటువంటి మాటలు లేకపోయినా, స్క్రీన్ పై ఇద్దరూ ఒకరికొకరు కనిపిస్తూ మాతృప్రేమను పంచుకుంటున్న ఈ వినూత్న ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.