కార్పెంటర్లకు అండగా నిలిచిన యాక్షన్ టెస్సా సంస్థ సాయం
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం
ఖమ్మం ఆర్ఆర్ఆర్ కన్వెన్షన్లో జాతీయ కార్పెంటర్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాక్షన్ టెస్సా సంస్థ సుమారు 600 మంది కార్పెంటర్లను సన్మానించింది. వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా, కుమార్తె వివాహానికి రూ.50 వేల ఆర్థిక సాయం, పిల్లల విద్యకు స్కాలర్షిప్లు, కుటుంబ సభ్యులకు ఉచిత శిక్షణ వంటి నాలుగు సంక్షేమ పథకాలను ప్రకటించింది. రాంబిల్లిలో నూతన తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.