నర్సంపేటలో బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: వరంగల్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులు మరియు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల అనుచిత వైఖరిని నిరసిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో భారాస మహిళా విభాగం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎత్తిచూపుతారనే భయంతోనే అక్రమంగా అరెస్టులు చేయించారని నేతలు మండిపడ్డారు. ప్రజాప్రతినిధులని చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.