చీకటి కోరల్లో చిక్కుకుని రోడ్డెక్కిన అన్నదాతల ఆక్రోశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిగురుమామిడి
హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో కరెంట్ కోతలను నిరసిస్తూ శనివారం రోజున రైతులు పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో, నిరంతరం విద్యుత్ కోతలు విధించడం వల్ల కొద్దిపాటి వరి, మొక్కజొన్న సాగు కూడా చేతికి అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ లేక పొలాలకు నీళ్లు పారక తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక అఖిలపక్ష నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.