మానవాళికి కృత్రిమ మేధ పెను ముప్పు: ఐరాస హెచ్చరిక

రిపోర్టర్: సతీష్ స్థలం: World

కృత్రిమ మేధ మానవాళికి సరికొత్త అవకాశాలతో పాటు పెను ముప్పుగా పరిణమిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. సరైన నియంత్రణ లేకపోతే ఏఐ ప్రపంచవ్యాప్తంగా అసమానతలను పెంచుతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి, యంత్రాలు కలిసి సహజీవనం చేసే నిబంధనలను నిర్దేశించగల చివరి తరం బహుశా మనమే కావచ్చని ఆయన పేర్కొన్నారు.