అలంపూర్లో ఉద్రిక్తత: గాంధీ విగ్రహం ఏర్పాటు వివాదంతో సెక్షన్ 163 అమలు
రిపోర్టర్: సునీల్
స్థలం: అలంపూర్
గాంధీ జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ పట్టణంలో నూతన గాంధీ విగ్రహ ఏర్పాటుపై తీవ్ర ఉద్రిక్తత నెలకొందని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు సెక్షన్ 163 అమలు చేస్తున్నారని డీఎస్పీ మొగులయ్య వెల్లడించారు. పాత విగ్రహాన్ని తొలగించి డంపింగ్ యార్డులో పడేయడంపై అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టడంతో ఈ వివాదం తలెత్తిందని, కలెక్టర్ చేతుల మీదుగా జరిగే విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.