నల్గొండ జిల్లాలో వినాయక నిమజ్జన వేళ యువకుడిపై కత్తితో దాడి

రిపోర్టర్: సురేష్ స్థలం: నల్గొండ

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి వినాయక నిమజ్జన ఊరేగింపులో పోతేపాక సాయిపై దుండగులు మారణాయుధాలతో దాడి చేసి గొంతు కోశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించగా, దాడికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.