టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానం: నంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకున్న అభిషేక్ శర్మ

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు ఐసీసీ అధికారులు వెల్లడించారు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో శతకం బాది అదరగొట్టిన అభిషేక్, సహచర ఆటగాడు ఇషాన్ కిషన్ను వెనక్కి నెట్టి నంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో అభిషేక్ శర్మ 897 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, గాయం కారణంగా ఇషాన్ కిషన్ మూడో స్థానానికి పడిపోయాడు.