సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దంటూ ఎస్సై ఉదయ్ కిరణ్ వార్నింగ్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. పోలీస్ స్టేషన్ ఎదుట సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుర్తుతెలియని కాల్స్, ఓటీపీలు, ఫేక్ లింకులు నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు వివరాలు పంచుకోవద్దని తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.