భారీ వర్షాలతో శ్రీకాకుళంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వంశధార నది

రిపోర్టర్: మహేష్ స్థలం: శ్రీకాకుళం

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి, బాహుదా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్టా బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హోం మంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు.