స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అవమానించేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడటం క్షమరాని నేరమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, దళితులకు జరిగిన అవమానమన్నారు. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి చేత రాజీనామా చేయించాలని లేదా సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.