మోదీ సభకు బుక్‌మైషో వేదికగా అపూర్వ స్పందన
రిపోర్టర్: శివ
స్థలం: గుజరాత్
గుజరాత్‌లోని వడోదరలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పబ్లిక్ ఈవెంట్ కోసం బుక్‌మైషో వేదికగా చేపట్టిన ఉచిత రిజిస్ట్రేషన్లకు అపూర్వ స్పందన లభించింది. కేవలం గంట వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడైపోగా, 42 వేల మందికి పైగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. డిజిటల్ పద్ధతిలో రద్దీ నియంత్రణకు చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైంది.