తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి పదిహేను గంటలు

రిపోర్టర్: రమేష్ స్థలం: తిరుమల

తిరుమలలో భక్తుల రద్దీ మరియు వసతి గదుల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా వెల్లడించింది. సర్వదర్శనానికి 31 క్యూపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్లు లేని వారికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. సోమవారం ఒక్కరోజే 67,632 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 24,909 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ. 2.91 కోట్లు వచ్చిందని మరియు 3.42 లక్షల లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.