సౌత్ లో ఉత్తరాది భామల హవా: చర్మవర్ణమే కారణమంటూ బాలీవుడ్ నటి సంచలనం

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

దక్షిణాది సినిమాల్ లో ఉత్తరాది నటీమణులకు ఎక్కువ అవకాశాలు దక్కడం వెనక వారి చర్మవర్ణమే ప్రధాన కారణమని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అభిప్రాయపడ్డారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దక్షిణాది తారలు అద్భుతమైన ప్రతిభావంతులని, అందంతో పాటు అన్ని భాషలు మాట్లాడగలరని కొనియాడారు. ముంబయి నుంచి నటీనటులను రప్పించి డబ్బింగ్ చెప్పించడం కంటే స్థానిక వారికే అవకాశాలు ఇవ్వడం మంచిదని ఆమె స్పష్టం చేశారు.