తెలంగాణలో పోలీసు ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా 7,437 పోస్టులకు గాను 5,77,064 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్బీ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ 29న, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 20న నిర్వహించనున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది.