యువతను అలరించేలా గుడ్ టైమ్ సినిమా: దర్శకుడు చాణక్య జిల్లా

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

యువతరానికి నచ్చే యూత్ఫుల్ ఎంటర్టైనర్గా గుడ్ టైమ్ సినిమా తెరకెక్కిందని, చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని దర్శకుడు చాణక్య జిల్లా వెల్లడించారు. ఈ చిత్రంలో భాగం కావడం పట్ల నటీనటులంతా ఎంతో ఆనందం వెలిబుచ్చారని ఆయన తెలిపారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు యువతకు తమకు తాము తెరపై చూసుకుంటున్న ప్రత్యేక అనుభూతి కలుగుతుందని నిర్మాత నమ్మకంగా చెప్పారని, చిత్రబృందం పేర్కొంది.