పులివెందులలో జగన్ జగన్నాటకం ఆడుతున్నారంటూ ఎస్ఈసీకి తెదేపా ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఫిర్యాదు

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయవాడ

పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగన్నాటకం ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ వర్ల రామయ్య మండిపడ్డారు. వర్ల రామయ్య ఆధ్వర్యంలో కూటమి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను కలిసి ఫిర్యాదు చేశారు. ఓటమి తథ్యమని తెలియడంతోనే జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.