ఎయిర్ ఇండియా కనిష్క బాంబు దాడి దర్యాప్తును మూసివేయాలని కెనడా యత్నం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కెనడా

ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఎయిర్ ఇండియా 182 కనిష్క విమాన బాంబు దాడి ఘటన జరిగి 41 ఏళ్లు పూర్తయిన తరుణంలో కెనడా రాయ్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ దర్యాప్తును పూర్తిగా మూసివేయాలని భావిస్తుండటం బాధితుల కుటుంబాలను తీవ్రంగా కలచివేసింది. 1985 జూన్ 23న అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 329 మంది ప్రాణాలు కోల్పోగా కెనడా ప్రభుత్వ వైఖరిపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.