శ్రీధర వేలేరులో ఓట్ల వేటలో దూకుడు పెంచిన సురేష్
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
కుక్కునూరు మండలంలోని శ్రీధర వేలేరు గ్రామంలో కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి తాళ్లూరి సురేష్ ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను నేరుగా కలుసుకుని తనకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థి విజయానికి కృషి చేశారు.