ఉద్యోగోన్నతి పొందిన ఏఎస్ఐలను అభినందించిన ఖమ్మం సీపీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం రూరల్

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా సేవలందించి ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి పొందిన పదకొండు మంది పోలీసు అధికారులకు సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సునీల్ దత్ అధికారిక చిహ్నాలను అలంకరించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పదకొండు మంది అధికారుల కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.